VIDEO: ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
WGL: గ్రేటర్ వరంగల్ లోని గుండ్ల సింగారం గ్రామంలో శాతరాశి కవిత - రాజుకుమార్ దంపతులు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కేటాయించిన ₹5 లక్షలతో తమ ఇంటిని నిర్మించి గృహప్రవేశం చేశారు. బుధవారం ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు. మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోంది అన్నారు.