అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా కమిటీ హాల్
NLR: బుచ్చి పట్టణంలోని 1వ వార్డు పెద్దూరు హరిజనవాడ వద్ద ఉన్న కమ్యూనిటీ హాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. రాత్రి సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి హల్చల్ చేస్తున్నట్లు స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.