VIDEO: క్రమక్రమంగా పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

KMM: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. బుధవారం ఉదయం 10 గంటలకు 39.5 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం మధ్యాహ్నం 2 గంటలకు 40.3 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి భారీగా వరద చేరుతుందని అధికారులు తెలిపారు. రాత్రి వరకు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.