VIDEO: టవర్ సర్కిల్ సమీపంలో అగ్నిప్రమాదం

VIDEO: టవర్ సర్కిల్ సమీపంలో అగ్నిప్రమాదం

కరీంనగర్ నగరంలోని టవర్ సర్కిల్ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కూరగాయల మార్కెట్కు వచ్చే మార్గంలో ఉన్న ఓ షాపులో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని, ఆ మంటలు చుట్టుపక్కల షాపులకూ వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.