అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

BHPL: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం మల్లారం గ్రామానికి చెందిన దుర్గం రాజయ్య (50) అనే రైతు ఆత్మహత్య ప్రయత్నం చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గురువారం అప్పుల బాధతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగగా ఆస్పత్రిలో చేర్పించారు. రాజయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.