గ్రావెల్ టిప్పర్ బోల్తా.. తప్పిన ప్రమాదం

గ్రావెల్ టిప్పర్ బోల్తా.. తప్పిన ప్రమాదం

కడప: మైదుకూరు మండలం గడ్డంవారిపల్లి సమీపంలో గ్రావెల్ లోడుతో అతివేగంగా వెళ్తున్న టిప్పర్ శుక్రవారం బోల్తా పడింది. హైవేపై ఇతర వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవలే ఇదే ప్రాంతంలో జరిగిన టిప్పర్-ఆటో ప్రమాదాన్ని గ్రామస్థులు గుర్తుచేసుకుంటూ, నిత్యం అతివేగంగా వెళ్లే ఈ భారీ వాహనాల వల్ల తమ ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.