తిరుమల బ్రహ్మోత్సవాలపై సమీక్ష

తిరుమల బ్రహ్మోత్సవాలపై సమీక్ష

TPT: శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకు వసతి, ఇతర సౌకర్యాలపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు తిరుమల అన్నమయ్య భవన్‌లో శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ.. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విశ్రాంతి గృహాలు, కాటేజీల్లో ఎలక్ట్రిక్ పనులు, మరుగుదొడ్ల రిపేర్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.