బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మున్సిపల్ ఛైర్మన్

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మున్సిపల్ ఛైర్మన్

కడప: పులివెందుల పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం ఉదయం మున్సిపల్ ఛైర్మన్ వర ప్రసాద్ పరామర్శించారు. ఇదే క్రమంలో బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్థానిక ప్రభుత్వ వైద్య సిబ్బందితో చర్చించారు. ఆయనతో పాటు పలువురు మున్సిపల్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.