గంజాయి కేసులో 14 మంది అరెస్ట్

GNTR: పొన్నూరులోని ఓం కాలనీ సమీపంలో గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి 14 మందిని గురువారం అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు షేక్ ఫజల్ ఒడిశా నుంచి గంజాయి తెప్పించి అమ్మినట్లు విచారణలో తేలింది. మొత్తం 1.5 కిలోల గంజాయి, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఫజల్ తల్లి ఆషా, మనోజ్ పరారీలో ఉన్నారని పొన్నూరు పోలీసులు తెలిపారు.