తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం
TG: ఫ్యూచర్ సిటీలో 'తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'కు సర్వం సిద్ధమైంది. ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. పెట్టుబడులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఈ సమ్మిట్ నిర్వహించనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు సదస్సును ఉద్దేశించి సీఎం రేవంత్ మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో నోబెల్ గ్రహీతలు బెనర్జీ, కైలాష్ సైతం ప్రసంగించనున్నారు.