VIDEO: వినాయక మండలాలకు అనుమతి తప్పనిసరి

E G: కొవ్వూరు రూరల్ మండలం లోని వినాయక ఉత్సవాలు నిర్వహించే ఉత్సవ కమిటీలు తప్పక అనుమతులు తీసుకోవాలని కొవ్వూరు పోలీసులు తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం కొవ్వూరు మండలం లోని పలు గ్రామాల్లో పోలీస్ సిబ్బంది వినాయక ఉత్సవాలు ఏర్పాటుపై ఆటోలో విసృతంగా ప్రచారం నిర్వహించారు. ఎవ్వరైనా అనుమతులు లేకుండా ఉత్సవాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.