గోదావరి పుష్కరాల నాటికి భద్రాద్రి సిద్ధం..!
TG: భద్రాచలం ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా ఆగమ శాస్త్రానుసారం అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూడు దశల్లో పనులను పూర్తి చేయాలన్నారు. 2027 మార్చి 31 నాటికి తొలిదశ పనులు ముగించాలని లక్ష్యంగా విధించారు. వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పుష్కర ఘాట్ల నిర్మాణం, భక్తులకు అవసరమైన సౌకర్యాలను సిద్ధం చేయాలని తెలిపారు.