శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందజేత

MHBD: పట్టణంలో మూడు నెలలుగా నిర్వహించిన ఉచిత కుట్టుశిక్షణ కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు వృత్తిపరమైన సర్టిఫికెట్లను నేడు కిసాన్ పరివార్ సీఈఓ డాక్టర్ వివేక్ పంపిణీ చేశారు. కిసాన్ పరివార్ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 150మంది మహిళలు శిక్షణ పొంది సర్టిఫికెట్లు అందుకున్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఉచితంగా మిషన్లు పంపిణీ చేయనున్నట్లు సీఈఓ తెలిపారు.