VIDEO: రాజన్న ఆలయ వసతి గదుల సముదాయంలో భారీ నాగు పాము
KNR: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయ వసతి గదుల సముదాయమైన పార్వతీపురం రూమ్ నెంబర్ వన్‌లో బుధవారం భారీ నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో ఒక్కసారిగా భక్తులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు చొరవ తీసుకొని స్నేక్ క్యాచర్‌ను నియమించాలని కోరుతున్నారు. ఎవరికి ఏమి కాకుండా చాకచక్యంగా స్నేక్ క్యాచర్ జగదీష్ భారీ నాగు పామును పట్టుకున్నారు.