భర్త హత్య కేసులో భార్య, బావమరిది అరెస్ట్

భర్త హత్య కేసులో భార్య, బావమరిది అరెస్ట్

KDP: రెండు రోజుల క్రితం జరిగిన కడప ఎర్రముక్కపల్లి బాల వికాస్ స్కూల్ వెనుక నివాసమున్న దేరంగుల సుబ్బరాయుడు (32) హత్య కేసులో మృతుడి భార్య హరిత, బావమరిది హరికృష్ణను అరెస్ట్ చేసినట్లు సీఐ రామకృష్ణ వెల్లడించారు. వివరాల్లోకెళ్తే మద్యం తాగి రావడంతో భార్య హరిత, బావమరిది హరికృష్ణ గొడవపడ్డారు. అనంతరం సుబ్బరాయుడిని గోడకేసి తోయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.