కలెక్టరేట్లో చలివేంద్రం ప్రారంభం
NLG: ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్, అశోక్ రెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. వేసవిలో కార్యాలయానికి వచ్చే సందర్శకులకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.