బీమా చెక్కును అందజేసిన ఎంపీ

బీమా చెక్కును అందజేసిన ఎంపీ

VSP: యాక్సిడెంట్‌లో మృతి చెందిన తమ్మినేని మోహన్ కుటుంబానికి టీడీపీ తరఫున రూ.5 లక్షల బీమా చెక్ అందజేశారు. మాధవదరాలో జరిగిన సంతాప సభలో విశాఖ ఎంపీ ఎం. శ్రీ భరత్ చేతుల మీదుగా ఈ చెక్కును కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా అవసరమైన ధ్రువపత్రాలు ఇప్పించడం, మిగతా సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు.