రేపు కలెక్టరేట్‌లో ప్రజాపాలన వేడుకలు

MHBD: కలెక్టరేట్‌లో ఈనెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉ.9:30 గం.కు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. జాటోత్ రామచంద్రనాయక్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రసంగిస్తారన్నారు. వేడుకలు విజయవంతం చేయాలని కోరారు.