మొంథా తుపాను ప్రశాంతంగా ముగిసింది: కలెక్టర్
కృష్ణా: కృష్ణా జిల్లాలో పెద్ద ప్రమాదం లేకుండా మొంథా తుపాను ప్రశాంతంగా ముగిసిందని జిల్లా యంత్రాంగానికి సహకరించిన ప్రజలకు జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మచిలీపట్నం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు 46 వేల హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని, దీనివల్ల 56వేల మంది రైతులపై ప్రభావం చూపిందని చెప్పారు.