'ప్రజావాణిని అధికారులు పట్టించుకోవడం లేదు'
VKB: ప్రతి మండలాలలో సోమవారం నిర్వహించే ప్రజావాణిని పలు శాఖల అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. జిల్లాలోని ధారూర్, పెద్దేముల్, యాలాలతో పాటు పలు మండలాలల్లో అధికారులు ప్రజావాణికి హాజరుకావడం లేదని, కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశాలు సైతం పాటించడం లేదని, ప్రజావాణి సక్రమంగా జరిగితే కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే అవసరం ఉండదని ప్రజలు తెలుపుతున్నారు.