దుకాణాల్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బుధవారం పోలీసు అధికారులు పలు కిరాణా దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా దీపావళి మందు సామాగ్రిని అక్రమంగా నిల్వ చేస్తున్నారన్న అనుమానంతో ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. దుకాణదారులకు కౌన్సిలింగ్ ఇచ్చిన అధికారులు మందు సామాగ్రిని నిల్వ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.