పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

WNP: మెట్పల్లి గ్రామ శివారులోని చింతతోటలో పేకాట ఆడుతున్న ఏడుగురిని వనపర్తి పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఆ స్థావరంపై దాడి చేశారు.  నిందితుల దగ్గర రూ.4,300 నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు టౌన్ ఎస్సై శశిధర్ తెలిపారు. పేకాట ఆడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.