విశాఖ రైల్వే స్టేషన్‌లో రోబో సేవలు
విశాఖ రైల్వే స్టేషన్‌లో ఈస్ట్ కోస్ట్ రైల్వేకు చెందిన వాల్తేరు డివిజన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో హ్యూమనాయిడ్ రోబో ‘ఎఎస్‌సీ అర్జున్’ను ప్రవేశపెట్టింది. భారతీయ రైల్వేలో ఇదే తొలిసారి. ప్రయాణికుల భద్రత, జనసమూహ నియంత్రణ, సమాచార ప్రకటనలు, ఫైర్-స్మోక్ గుర్తింపులో రోబో సహాయపడుతుంది. రోబోను డీఆర్‌ఎం లలిత్ బోహ్ర గురువారం ఆవిష్కరించారు.