'పద్మశాలీలకు ప్రాధాన్యం ఇవ్వాలి'
GNTR: చట్టసభల్లో పద్మశాలీలకు ప్రాధాన్యం దక్కడం లేదని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం మంగళగిరిలో ఆయన మాట్లాడుతూ, తమకు 16 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాజధానిలో భవన్‌కు 3 ఎకరాలు ఇవ్వాలన్నారు. తమ డిమాండ్ల సాధనకు ఈ నెల 26న మంగళగిరిలో పద్మశాలి మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.