మినాబ్‌లో దాడి ఇరాన్ పనే: ట్రంప్
మినాబ్‌లోని బాలికల పాఠశాలపై జరిగిన దాడి ఇరాన్ పనేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు. వారి ఆయుధాలకు గురి, కచ్చితత్వం లేకపోవడమే ఈ ఘోరానికి కారణమని, ఈ దాడిలో 150 మందికి పైగా మరణించారని పేర్కొన్నారు. మరోవైపు, కువైట్‌లోని సోషల్ సెక్యూరిటీ భవనం, అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఉన్న చమురు డిపోలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో భారీగా మంటలు చెలరేగాయి.