యూరియా కోసం బారులు తీరిన రైతులు

యూరియా కోసం బారులు తీరిన రైతులు

కృష్ణా: గన్నవరంలో ఓ ఎరువుల దుకాణం వద్ద శుక్రవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా సదరు ఎరువుల దుకాణానికి యూరియా స్టాక్ వచ్చిన విషయం తెలుసుకుని పరిసర గ్రామాలకు చెందిన రైతులు అక్కడికి చేరుకున్నారు. వ్యవసాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో యూరియా పంపిణీ చేశారు.