'మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఉంచాలి'
W.G: భీమవరం కలెక్టరేట్ ఛాంబర్‌లో కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఇన్‌ఛార్జ్ జిల్లా ఆబ్కారీ అధికారి ఆర్.వి. ప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి కలెక్టర్‌కి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా మత్తు పదార్థాల అమ్మకం, వినియోగం ఉండొద్దన్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.