ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: ఉగాది పర్వదినాన రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించడం సంతోషకరమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మున్సిపల్ పరిధిలోని ఊరెళ్ళ 1, 2 వార్డులలో నిర్మించిన ఈ ఇళ్లను జిల్లా అదనపు కలెక్టర్ కె. శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతా వెంకట్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.