ఏకగ్రీవంగా హిరమండల APTF నూతన కార్యవర్గం ఎన్నిక
SKLM: హిరమండలం APTF శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు సోమవారం MPUP పాఠశాలలో జరిగాయి. అధ్యక్షుడిగా అగదల సింహాచలం, ప్రధాన కార్యదర్శిగా నివగాన మురళీధరరావు, ఉపాధ్యక్షుడిగా బి. రమేశ్, మహిళా ఉపాధ్యక్షురాలిగా గంగేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, సభ్యులకు అండగా ఉంటామని కొత్త కార్యవర్గం ప్రకటించింది.