నూతన పోప్‌గా రాబర్ట్‌ ప్రవోస్ట్‌

నూతన పోప్‌గా రాబర్ట్‌ ప్రవోస్ట్‌

అమెరికాకు చెందిన రాబర్ట్‌ ప్రవోస్ట్‌ కొత్త పోప్‌గా ఎన్నికయ్యారు. ఆయన్ను పోప్‌ లియోగా పిలువనున్నారు. 133 మంది కార్డినల్‌లు రహస్యంగా సమావేశమై తదుపరి పోప్‌ను ఎన్నుకున్నారు. దీనికి సూచనగా వాటికన్‌లోని ప్రాచీన సిస్టిన్‌ చాపెల్‌ చర్చి పొగగొట్టం నుంచి తెలుపురంగు పొగ వెలువడింది. పోప్‌గా ఓ అమెరికన్‌ ఎన్నిక కావడం ఇది తొలిసారి.