VIDEO: క్షయ వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ
కోనసీమ: కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో పీహెచ్సీ డాక్టర్ రత్న కుమారి ఆధ్వర్యంలో మంగళవారం క్షయవ్యాధి నివారణ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రత్నకుమారి మాట్లాడుతూ.. క్షయ వ్యాధి లక్షణాలు ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా వ్యాధిని నివారించడం సులభం అవుతుందన్నారు. క్షయ వ్యాధి నివారణ మార్గాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.