ఉచిత శిక్షణకు దరఖాస్తులు

చిత్తూరు: జిల్లాలో ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్, సర్వేయింగ్ కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. పదో తరగతి, ఆపై కోర్సులు చదివిన అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. వయస్సు 18-35 ఏళ్లలోపు ఉండాలన్నారు. ఈ నెల 9వలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.