'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

BPT: ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిజాంపట్నం ఎస్సై తిరుపతిరావు మంగళవారం తెలిపారు. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచిత వ్యక్తులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులు కాజేస్తున్నారని అన్నారు.