అభివృద్ధి కార్యక్రమాలపై జడ్పీ సీఈవో సమీక్ష

ఉమ్మడి విశాఖ జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, పీ-4 సర్వే, శానిటేషన్‌పై గురువారం జడ్పీ సీఈవో నారాయణమూర్తి ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పీ-4 సర్వేను వేగవంతంగా చేయాలన్నారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు.