పూతలపట్టులో ఫుడ్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

CTR: ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషనర్ దేవి గంజిమల పూతలపట్టు ఉన్నత పాఠశాలలో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థులకు సరైన మోతాదులో భోజనం ఇవ్వడంలో లోపాలు ఉన్నాయని వంటవారిపై, HMపై అసహనం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పాఠశాలలు, అంగన్వాడీలు, హాస్టల్స్, పీహెచ్సీలను పరిశీలించామని ఆమె వెల్లడించారు.