రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన బీజేపీ నేతలు

SRD: వట్ పల్లి మండల కేంద్రంలో గత 12 సంవత్సరాలుగా రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా బీజేపీ నాయకులు శనివారం రోడ్డుపై వరి నాట్లు వేశారు. అల్లాదుర్గ్ ఎక్స్ రోడ్ నుంచి మెటల్ కుంట వరకు రోడ్డు దుస్థితి భయంకరంగా ఉందని, వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.