పాకిస్తాన్ దాడి పిరికిపంద చర్య: భారత్

పాకిస్తాన్ దాడి పిరికిపంద చర్య: భారత్

అఫ్గాన్‌పై పాకిస్తాన్ చేసిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. రంజాన్ వేళ దాడులు దారుణమని భారత విదేశాంగశాఖ చెప్పింది. అఫ్గాన్ సార్వభౌమత్వంపై దాడిగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. పాక్ దాడిని పిరికిపంద చర్యగా పేర్కొంది. ఇది మిలిటరీ దాడి కాదని.. ఊచకోత అని ఆక్షేపించింది. కాగా, కాబూల్‌లోని ఆసుపత్రిపై పాక్ చేసిన దాడిలో 400 మంది చనిపోయిన విషయం తెలిసిందే.