'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'

KMM: వైరా మండలంలో బూత్ లెవల్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని బీజేపీ మండల కార్యదర్శి బండారు నరేష్ బాబు తెలిపారు. ఈ నెల 17 నుంచి పార్టీ ఆధ్వర్యంలో అక్టోబర్ 2 వరకు చేపట్టబోయే కార్యక్రమాలపై సోమవారం వైరాలో టౌన్ అధ్యక్షుడు మనుబోలు వెంకటకృష్ణ అధ్యక్షతన కార్యశాల నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని కోరారు.