లేబర్ కోడ్ చట్టాల పత్రాలను దగ్ధం చేసిన నాయకులు
ప్రకాశం: కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ చట్టాలకు నిరసనగా హనుమంతునిపాడులో సీఐటీయు ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లేబర్ కోడ్ చట్టాల పత్రాలను సీఐటీయూ నాయకులు దగ్ధం చేశారు. కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ చట్టాలను తీసుకువచ్చి , కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడిందని విమర్శించారు.