'ప్రకృతి ఆరాధన ప్రాముఖ్యత తెలుసుకోవాలి'
కృష్ణా: కార్తీక వన సమారాధన, ప్రకృతి ఆరాధన ప్రాముఖ్యత గుర్తు చేస్తుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ఇవాళ అవనిగడ్డ మండలం పులిగడ్డలోని జలవనరుల శాఖ అతిధి గృహంలో కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే విచ్చేసి ఉసిరి చెట్లకు పూజలు చేశారు. ఇరిగేషన్ ఎస్ఈ ఆర్.మోహనరావుతో కలిసి వన భోజనం చేశారు.