సునామీల నుంచి రక్షణగా 'గ్రేట్ సునామీ వాల్'

సునామీల నుంచి రక్షణగా 'గ్రేట్ సునామీ వాల్'

జపాన్ లో 2011లో వచ్చిన సునామీ తర్వాత, భవిష్యత్తులో అలాంటి విలయాలు సంభవించకుండా రక్షణ కోసం 'గ్రేట్ సునామీ వాల్'ను నిర్మించారు. 395 కిలోమీటర్ల పొడవు, 50 అడుగుల ఎత్తుతో సునామీలను తట్టుకునేలా దీన్ని అత్యంత ధృడంగా నిర్మించారు. దీనికి అదనంగా, సునామీ తరంగాల వేగాన్ని తగ్గించేందుకు 90 లక్షల చెట్లను నాటారు. దీని నిర్మాణానికి సుమారు 50,000 కోట్ల రూపాయలు ఖర్చయింది.