తిప్పాపూర్‌లో 135 మంది మహిళా ఓటర్లు అధికం
KMR: భిక్కనూర్ మండలం తిప్పాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఓటర్ లిస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి. 12 వార్డుల్లో మొత్తం 2,897 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,381 మంది పురుషులు, 1,516 మంది మహిళలు ఉన్నారు. సర్పంచ్ స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. ఇక్కడ 135 మంది మహిళలు అధికంగా ఉన్నారు. ఆశావాహులు మహిళలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మహిళా ఓటర్లే నిర్ణయాత్మకం కానున్నారు.