VIDEO: మలక్ పేటలో భారీగా ట్రాఫిక్ జామ్

HYD: మలక్‌పేట రైల్వే బ్రిడ్జి సమీపంలో భారీగా ట్రాఫిక్ జామైంది. మలక్‌పేట -ఛాదర్ ఘాట్ ప్రధాన రహదారిపై డ్రైనేజీ ఓవర్ ఫ్లో అయ్యింది. మురుగునీరు రోడ్ల మీద నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సైదాబాద్, ఎల్బీనగర్ రూట్‌లో వాహనాలు కిలో మీటర్ మేర నిలిచిపోయాయి. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి ఖైరతాబాద్ రూట్‌లోనూ ట్రాఫిక్ జామైంది.