ఉండిలో కలకలం రేపిన జంట హత్యలు

ఉండిలో కలకలం రేపిన జంట హత్యలు

W.G: మండల కేంద్రం ఉండిలో జంటహత్యలు కలకలం రేపాయి. భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపిన వివరాల ప్రకారం.. ఉండి నిమ్మనపేటలో దొంగ సుబ్బారావు, కడలి విజయలక్ష్మిలు సహజీవనం చేస్తున్నారు. సోమవారం సుబ్బారావు రైల్వే స్టేషన్ సమీపంలో మృతి చెందగా, అతని వద్ద ఉన్న తాళంతో ఇంటి తలుపులు తెరిచి చూస్తే విజయలక్ష్మి మృతి చెంది ఉంది. దీనిని హత్య కేస్‌గా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.