సీఎం ప్రజావాణిలో 399 దరఖాస్తులు

సీఎం ప్రజావాణిలో 399 దరఖాస్తులు

HYD: ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన 210వ సీఎం ప్రజావాణి కార్యక్రమంలో 399 దరఖాస్తులు అందాయని అధికారులు వెల్లడించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 138, రెవెన్యూ శాఖకు 56, ఇందిరమ్మ ఇళ్ల కోసం 122 దరఖాస్తులు రాగా, ఇతర శాఖలకు సంబంధించి 83 దరఖాస్తులు వచ్చాయని సీఎం ప్రజావాణి ఇంఛార్జ్ జీ.చిన్నారెడ్డి చెప్పారు.