VIDEO: ఉత్సవాల్లో అపశృతి… భక్తుడికి గాయాలు
HNK: భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమంలో శనివారం రాత్రి అపశృతి చోటుచేసుకుంది. అగ్నిగుండాల్లో నడుస్తున్న సమయంలో ఒక భక్తుడు కాలుజారి నిప్పులో పడటంతో స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన భక్తుడికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించి అనంతరం మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.