ఆటోను ఢీకొన్న లారీ.. యువతి మృతి
ADB: గుడిహత్నూర్ మండలం సీతాగొంది సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఓ ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కొల్హారికి చెందిన కాగ్ని అశ్విని(19) అక్కడికక్కడే మృతి చెందింది. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కాగ్ని వసంత్ గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రుడిని రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.