‘వైసీపీ డిజిటల్ బుక్ యాప్‌ను’ లాంచ్ చేసిన మాజీ సీఎం
GNTR: కార్యకర్తల ఫిర్యాదు కోసం ‘వైసీపీ డిజిటల్ బుక్ యాప్’ను ఆ పార్టీ చీఫ్ జగన్ లాంచ్ చేశారు. అన్యాయానికి గురవుతున్న కార్యకర్తల కోసం దీన్ని తీసుకొచ్చామని ఆయన తెలిపారు. తాడేపల్లిలో బుధవారం జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.