వెయిట్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకాలు సాధించిన విద్యార్థులు

వెయిట్‌ లిఫ్టింగ్‌లో స్వర్ణ పతకాలు సాధించిన విద్యార్థులు

VZM: ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో బుల్లయ్య కాలేజీలో ఈరోజు నిర్వహించిన ఇంటర్ స్టేట్ లెవల్ వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో విజయనగరం, కొండవెలగాడకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. వారిలో ఐదుగురు స్వర్ణ పతకాలు సాధించగా, ముగ్గురు రజత పతకాలు కైవసం చేసుకున్నట్లు కోచ్‌లు శ్రీను, రాము తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వారిని అభినందించారు.