చెరువు కాదిది.. మురికి కుంట
SRCL: పచ్చని చెట్లు, చుట్టూ అందమైన భవంతుల ఇండ్లు పక్కనే నిండుగా నీటితో కళకళడుతూ ఆహ్లాదకరమైన వాతావరణం తలపిస్తుందని అనుకుంటే తప్పులో కాలేసినాట్లే. ఎందుకంటారా.. మీరు చూసేది చెరువు కాదు మురికి కుంట. నమ్మశక్యం కావడం లేదా కోనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ప్రధాన రోడ్డు వెంబడి ఇండ్ల మధ్యలో మురుగు నీరు ఇలా నిల్వ ఉండిపోయింది.